: రైల్వే వ్యవస్థను తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం: మంత్రి బన్సల్
ప్రమాద రహితంగా రైల్వే వ్యవస్థను తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని మంత్రి పవన్ కుమార్ బన్సల్ చెప్పారు. నిరంతర నష్టాలు, రైల్వేల్లో సౌకర్యాలు, సదుపాయాల కల్పనకు విఘాతం కలుగుతుందని వివరించారు.
భారతీయ రైల్వేలు ఆర్ధికంగా నిలదొక్కుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. రైల్వే నిర్వహణకు వ్యయం మరింత పెరిగిందన్నారు. కుంభమేళా సందర్భంగా అలహబాద్ రైల్వే స్టేషన్లో ఘటన అత్యంత దురదృష్టకరమని బన్సల్ పేర్కొన్నారు.
40 శాతం ప్రమాదాలు లెవల్ క్రాసింగుల వల్లే జరుగుతున్నాయనీ, లెవల్ క్రాసింగులకు కేంద్రం నుంచి అందుతుంది వెయ్యికోట్లు మాత్రమేనని చెప్పారు. మహిళా ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక మహిళా సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. వరుస నష్టాల వల్ల కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి అవరోధం కలుగుతుందన్నారు.