: హైదరాబాదును యూటీ చేస్తే ఒప్పుకునేది లేదు: వీహెచ్
హైదరాబాదును యూటీ చేస్తే ఒప్పుకునేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రజలకు అక్కడి నేతలే అన్యాయం చేస్తున్నారని అన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమకారుల సభలకు అనుమతి ఇవ్వని సర్కారు, ఏపీఎన్జీవోల సభకు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. ఏపీఎన్జీవోల సభకు అనుమతిని రద్దు చేయాలని ఆయన సూచించారు. హైదరాబాద్ లో గొడవలు జరిగితే తెలంగాణ వారినే బాధ్యులను చేస్తారని వీహెచ్ ఆరోపించారు. సీఎం కిరణ్ ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమని అన్నారు. తెలంగాణకు అనుకూలమని చెప్పిన టీడీపీ ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకుందని ఆయన ప్రశ్నించారు. అన్ని పార్టీలు లేఖలు ఇచ్చిన తరువాతనే విభజన నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు.