: సమైక్యవాదులను సభకు అనుమతించాలి: ఏపీఎన్జీవోలు


హైదరాబాదులో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు తమతోపాటు సమైక్యవాదానికి మద్దతిచ్చే పలు రంగాలకు చెందిన వారిని అనుమతించాలని ఏపీఎన్జీవోలు కోరుతున్నారు. హైదరాబాదులో సమైక్యవాదులు ఎంతోమంది ఉన్నారని వారందరికీ అనుమతినివ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎన్జీవోలకు మాత్రమే అనుమతిచ్చారని, ఈ విషయమై పోలీసు అధికారులతో మాట్లాడుతున్నామని తెలిపారు. ఐటీ ఉద్యోగులను ఇందులో భాగస్వాములను చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. సభకు వచ్చేవారికి గులాబీలతో స్వాగతం పలుకుతామని అన్నారు.

  • Loading...

More Telugu News