: మీ పర్యటన వెనుక రహస్యం ఏంటి మహాశయా?: రేవూరి
'మీ పర్యటన వెనుక రహస్యం ఏంటి మహాశయా?' అని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరాం, టీజీవో నేత శ్రీనివాస్ గౌడ్ లను టీడీపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం సీఎం, పీసీసీ చీఫ్ లను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విభజనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ముఖ్యనేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన సూచించారు.