: మన్మోహన్ పై తూటాలు పేల్చిన బాబు!
గుంటూరు జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మన్మోహన్ సింగ్ పై విరుచుకుపడ్డారు. ఆయనను ఒక పనికిమాలిన ప్రధానిగా అభివర్ణించారు. అబ్బరాజుపాలెం వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, ప్రధాని సోనియా చేతిలో తోలుబొమ్మగా మారారని ఆరోపించారు. ఆయనంత అసమర్ధుడు మరెవ్వరూ లేరని విమర్శించారు. అవకతవక నిర్ణయాలతో దేశ ఆర్ధిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో రూపాయి పతనమై, అవినీతి పెరిగిపోయిందని అన్నారు. కూరగాయలు కొనేందుకు గోనెసంచితో డబ్బులు తీసుకెళ్ళాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గురించి మాట్లాడుతూ.. ఇటలీ మాఫియా వ్యవస్థ యూరప్ లోనే అతిపెద్ద మాఫియా నెట్ వర్క్ అని, ఆమె ఇటలీ నుంచి వచ్చిందన్న విషయం మరువరాదని చెప్పుకొచ్చారు. సోనియా రాజకీయ దురుద్దేశంతోనే విభజన నిర్ణయం తీసుకున్నారని బాబు పేర్కొన్నారు.