: సోనియాకు అమెరికా కోర్టు సమన్లు


సిక్కులపై 1984 నవంబర్ లో జరిగిన దాడుల వ్యవహారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అమెరికా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ దాడుల్లో కొందరు కాంగ్రెస్ నాయకుల హస్తం ఉండగా.. వారికి సోనియా అండదండలు అందిస్తున్నారంటూ 'సిక్స్ ఫర్ జస్టిస్'(ఎస్ఎఫ్ జే)అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. న్యూయార్క్ లోని తూర్పు జిల్లా కోర్టు ఈ పిటిషన్ ను పరిశీలించి తాజా సమన్లు ఇచ్చింది. ఎస్ఎఫ్ జే తో పాటు ఇతర సిక్కు మానవ హక్కుల బృందాలు కూడా ఈ పిటిషన్ దాఖలు చేశాయి. ఫెడరల్ నిబంధనల ప్రకారం సోనియాకు సమన్లు అందజేసేందుకు తమకు 120 రోజుల గడువు ఉంటుందని ఎస్ఎఫ్ జే తరపు న్యాయవాది తెలిపారు. ప్రస్తుతం చికిత్స కోసం సోనియా అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News