: రెండు టెస్టుల సిరీస్ కు విండీస్ బోర్డు ఓకే


నవంబర్ లో టీమిండియాతో రెండు టెస్టుల సిరీస్ కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సమ్మతి తెలిపింది. బీసీసీఐ పంపిన ఆహ్వానాన్ని మన్నిస్తున్నట్టు ఈమేరకు విండీస్ బోర్డు నేడు ఓ ప్రకటనలో వెల్లడించింది. 'నవంబర్ లో విండీస్ జట్టు భారత్ లో పర్యటిస్తుంది. ఈ టూర్లో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు ఉంటాయి. ద్వైపాక్షిక పర్యటనల్లో భాగంగా ఈ సిరీస్ కు అంగీకరించాం' అని విండీస్ బోర్డు పేర్కొంది. కాగా, డిసెంబర్ లో టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. ఆ కఠిన పర్యటనకు విండీస్ తో సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడుతుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నా, సచిన్ కు 200వ టెస్టును సొంతగడ్డపై ఆడే అవకాశం కల్పించేందుకే బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని క్రికెట్ వర్గాలంటున్నాయి.

  • Loading...

More Telugu News