: ఇక అమ్మాయిలకూ అక్కడ అడ్మిషన్‌ దొరుకుతుంది!


అనగనగా ఒక పాఠశాల... ఆ పాఠశాల కొన్ని వందల సంవత్సరాల నుండి బాలురకే పరిమితమైంది. అందులో బాలికలకు ప్రవేశం నిషిద్ధం. అయితే ఆ పాఠశాలలో ఇప్పుడు ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని పాలకమండలి తీసుకుంది. సదరు పాఠశాలలో బాలికలకు కూడా ప్రవేశానికి అనుమతినిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో సంతోషంగా పాఠశాలకు వెళ్లేందుకు బాలికలు సిద్ధమవుతున్నారు.

ఇంగ్లండు స్ట్రాట్‌ ఫర్డ్‌లోని 6వ ఎడ్వర్డ్‌ రాజు పాఠశాలలో సుమారు 460 సంవత్సరాల పాటు బాలికలను అనుమతించలేదు. ఈ పాఠశాల బాలురకు మాత్రమే పరిమితమైంది. ఇదే పాఠశాలలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంగ్లకవి, నాటక కర్త షేక్‌స్పియర్‌ 1571లో చదువుకున్నాడు. ఇప్పటి వరకూ చాలా వరకూ బాలురకు సంబంధించిన పాఠశాలలు తర్వాత, బాలికలకు కూడా ప్రవేశాన్ని అనుమతించాయి. అయితే ఈ పాఠశాల మాత్రం ఇప్పటి వరకూ బాలికలకు ప్రవేశాన్ని అనుమతించే విషయంలో అంగీకరించలేదు.

2002లో బాలికల ప్రవేశానికి సంబంధించిన తీర్మానాన్ని తెస్తే దాన్ని పాఠశాల పాలకమండలి నిర్ధాక్షిణ్యంగా తోసిపుచ్చింది. చివరికి 2011కి అమ్మాయిల ప్రవేశానికి సంబంధించిన తీర్మానానికి పాలకమండలి ఏకగ్రీవంగా ఆమోదాన్ని తెలిపింది. ఈ ఏడాదికి 30 మంది అమ్మాయిలను సెప్టెంబరు ప్రవేశాల కింద ఆరోఫారమ్‌లోకి చేర్చుకుంది. ఈ నిర్ణయాన్ని గురించి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బెనెట్‌ కేర్‌ మాట్లాడుతూ షేక్స్‌పియర్‌ ఇప్పుడు ఉంటే పాలకమండలి తీసుకున్న ఈ నిర్ణయాన్ని విని చాలా సంతోషించేవాడని, తన నాటకాల్లో అమ్మాయిలు నటించడాన్ని కూడా ఆయన ఎంతో ప్రోత్సహించేవాడని అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News