: రాహుల్ గాంధీ ఒక మొద్దబ్బాయి, పప్పుసుద్ధ: బాబు
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ మొద్దబ్బాయని, అంతకుమించి పప్పు సుద్ధ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఆ పప్పుసుద్ధను ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్ విభజనకు కుట్ర పన్నిందని బాబు ఆరోపించారు. గుంటూరు జిల్లాలో బస్సుయాత్ర చేస్తున్న బాబు ఈ సాయంత్రం పెదకూరపాడు నియోజకవర్గంలోని ఊటుకూరులో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ఈమారు డిపాజిట్లు రావనే కాంగ్రెస్ కుట్ర పన్నిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలనుకోవడం కూడా ఆ కుట్రలో భాగమేనన్నారు.