: హ్యాకింగ్ బారిన పడ్డ ట్విట్టర్
సామాజిక వెబ్ సైట్ ట్విట్టర్ హ్యాకింగ్ కు గురైంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ అధికార వర్గాలే స్వయంగా చెప్పాయి. మొత్తం రెండున్నర లక్షల యూజర్ ఐడీలు, పాస్ వర్డులు హ్యాకింగ్ ద్వారా దొంగిలించబడ్డాయని ట్విట్టర్ సమాచార భద్రతా సేవల డైరెక్టర్ బాబ్ వెల్లడించారు.
సంస్థకు చెందిన ఓ ఉద్యోగి వాడుతున్న కంప్యూటర్లోని జావా సాఫ్ట్ వేర్ ను ఉపయోగించుకోవడం ద్వారా హ్యాకింగ్ జరిగినట్లు ప్రాధమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. అయితే హ్యాకింగ్ పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని బాబ్ అన్నారు.