: విడిపోదాం.., వద్దు కలిసుందాం: విద్యుత్ సౌధలో పోటాపోటీ నిరసనలు
విద్యుత్ సౌధలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీ ఆందోళనలు చేస్తున్నారు. గత 33 రోజులుగా సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి పోటీగా తెలంగాణ ప్రాంత ఉద్యోగులు నిరసనలకు దిగారు. అమరవీరుల స్థూపం నమూనా పెట్టి దాని ముందు విడిపోదాం అంటూ తెలంగాణ ప్రాంత ఉద్యోగులు నినాదాలు చేశారు. వీరికి దీటుగా విభజన వల్ల చేటు ఎక్కువ.. ఐకమత్యమే మహాబలం అందుకే కలిసుందాం అంటూ సీమాంధ్ర ఉద్యోగులు నినాదాలు చేశారు.