: రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఛత్తీస్ గఢ్ కోర్టు సమన్లు జారీ చేసింది. 21 నెలల కిందట తన వ్యాఖ్యల ద్వారా ఓ వర్గానికి చెందిన వ్యక్తుల భావాలను నొప్పించిన కేసులో సమన్లు ఇచ్చిన న్యాయస్థానం.. సెప్టెంబర్ 19లోగా తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. నవంబర్ 14, 2011న ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. యూపీ, బీహార్ లోని కొంతమంది ప్రజలు పనికోసం, అడుక్కునేందుకు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాటలతో ఓ వర్గం ప్రజలను ఆయన కించపరిచారంటూ అరవింద్ ఠాకూర్ అనే ఓ న్యాయవాది డిసెంబర్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఠాకూర్ ఇదే విషయమై అటు కోర్టులో పిటిషన్ కూడా వేశాడు.