: ఆనం.. తప్పెట వాయించిన వైనం
విలక్షణ చేష్టలతో మీడియా దృష్టిని ఆకర్షించే నేతల్లో నెల్లూరు శాసనసభ్యుడు ఆనం వివేకానందరెడ్డిది ప్రత్యేక స్థానం. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం సమైక్యాంధ్ర ఉద్యమం ఆరంభం కాగా.. అప్పటినుంచి ఆయన ఏదోరకంగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, నెల్లూరులో జరిగిన ర్యాలీలోనూ ఆయనే ప్రత్యేక ఆకర్షణ. తప్పెట మెడలో వేసుకుని పక్కా ప్రొఫెషనల్ స్టయిల్లో ఆయన వాయిస్తుంటే, ఉద్యమకారులు ఉత్సాహంతో చిందేశారు. ఈ దృశ్యం పలువురిని విశేషంగా ఆకట్టుకుంది.