: కూతురినిచ్చి ఫ్రిజ్ తెచ్చుకున్న తల్లి


వస్తు మార్పిడి విన్నాం. పూర్వం కరెన్సీ లేని రోజుల్లో ధాన్యం, ఇతరత్రా వస్తువులను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునేవారు. కరెన్సీ వచ్చిన తర్వాత కూడా కొన్ని రకాల వస్తు మార్పిడులు జరిగాయి. ప్రస్తుతం ఏది కావాలన్నా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే. కానీ, మనసులేని తల్లి కూతురుతో వస్తుమార్పిడి చేసుకుంది. నాలుగు వంట సామానుల కోసం, ఒక ఫ్రిజ్ కోసం.. నవమాసాలు మోసి, కని, పెంచిన 11 ఏళ్ల కూతురుని పొరుగింటి వారికి ఇచ్చేసింది అర్జెంటీనా మహిళ.

ఆ తర్వాత ఆ బాలికను బలవంతంగా బ్యూనాస్ ఎయిర్స్ లోని ఒక అల్యూమినియం ఫ్యాక్టరీలో పనికి కుదిర్చారు. అక్కడ ఆ బాలిక లైంగిక అకృత్యాలకు గురైంది. పోలీసులు రంగంలో దిగడంతో ఎట్టకేలకు విముక్తి కలిగింది. అంతేకాదు ఆ చిన్నారిలానే 14 నుంచి 17 ఏళ్ల వయసు ఉన్న మరికొందరికీ వెట్టి చాకిరీ నుంచి విముక్తి లభించింది.

  • Loading...

More Telugu News