: ఎన్నికల లబ్ది కోసమే టీడీపీ, వైఎస్సార్సీపీ యాత్రలు: బొత్స
ఎన్నికల్లో గెలవడం కోసమే తెలుగుదేశం, వైఎస్సార్సీపీ డ్రామాలు ఆడుతున్నాయని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. రాజకీయ లబ్ది కోసమే ఈ రెండు పార్టీల నేతలు యాత్రలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. గతంలో విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన వారే ఇప్పుడు యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో దిగ్విజయ్ తో భేటీ ముగిసిన అనంతరం బొత్స మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరు పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.
జాతీయ నాయకులను విమర్శించడం సరి కాదని సూచించారు. దయచేసి సంయమనం పాటించాలన్న బొత్స, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఏం చేస్తారో చెప్పని చంద్రబాబు అధికారం ఇవ్వమంటున్నారని, తమకు చెప్పడం ఇష్టం లేకపోతే బహిరంగ లేఖల ద్వారానైనా ప్రజలకు చెప్పాలని సూటిగా అడిగారు.