: లాంతరుపై వంట ఇక చిటికెలో పని


పల్లెల్లో మసకమసకగా వెలుగుతూ నేటికీ కిరోసిన్ లాంతర్లు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడొస్తుందో తెలియని కరెంటుతో వారి జీవితాలకు లాంతర్లే వెలుగునిస్తూ ఉంటాయి. సౌర లాంతర్లు వచ్చినా వాటి ఖరీదు పేదవారు అందుకోలేనిదే. అందుకే చౌకగా లభించే లాంతర్లే పేదవారికి దిక్కు. ఇక నాలుగు పుల్లలు పోగేసి వంట చేసుకోవడమూ వారి దినచర్యలో భాగం. అయితే, లాంతరు నుంచి, పొయ్యి నుంచి వచ్చే పొగ పేదవారి ఆరోగ్యానికి చేటు తెస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన పరిశోధకులు కాలుష్య రహిత లాన్ స్టవ్ (లాంతరు, స్టవ్ కలిపారు కనుక)ను తయారు చేశారు. నింబ్కర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం నిపుణులు దీన్ని రూపొందించగా, ఈ ప్రాజెక్టుకు అనిల్ రాజ్ వంశీ నేతృత్వం వహించాడు.
  • Loading...

More Telugu News