: 'అనంత సింహగర్జన' ప్రారంభం
అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 'అనంత సింహ గర్జన' సభ ప్రారంభమైంది. వేలాదిగా తరలి వస్తున్న సమైక్యవాదులు, ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులతో అనంతపురం పట్టణం జనసంద్రంగా మారింది. 35 రోజులుగా శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వంలో స్పందన రాకపోవడంతో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ఈ సభలో నిర్ణయించనున్నారు. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఉద్యమం నడిపించడం ద్వారానే సమైక్యవాదాన్ని చాటాలన్నది తమ లక్ష్యమని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు.