: రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు ఢోకా లేదు.. మిగిలినవారికి మొండిచెయ్యే
సీమాంధ్రలోని విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లకు ఢోకా లేదని ప్రభుత్వం తెలిపింది. గత నెల రోజులుగా అన్ని శాఖల ప్రభుత్వోద్యోగులు సమ్మెలో ఉండడంతో జీతాల చెల్లింపులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సీమాంధ్ర ప్రాంతంలో రిటైర్డ్ ఉద్యోగులు 3.08 లక్షల మంది ఉండగా ఫించన్ల చెల్లింపుకు బ్యాంకులు ముందుకు రావడంతో 62 వేల మంది మినహా 2.46 లక్షల మందికి సోమవారం చెల్లింపులు చేశారు. ట్రెజరీ ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో వీరి జీతాల చెల్లింపులకు హైదరాబాద్ నుంచే ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వీరితో పాటు పోలీసులకు మాత్రం జీతాలు పూర్తి స్థాయిలో ఆందాయి. మిగిలిన శాఖల్లో కొద్ది మందికి తప్ప మిగిలిన వారెవరికీ జీతాలు అందలేదు.