: ఇలా కూడా దొంగతనం చేస్తారా?


దొంగలు తాము కొట్టేసిన డబ్బును రకరకాల పద్ధతిలో దాస్తుంటారు. అయితే, ఈ విషయంలో ఓ అమ్మడు మరో అడుగు ముందుకేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. స్నేహితుడిని మోసం చేసి అతనివద్దనుండి దొంగిలించిన ఐదువేల డాలర్లను మలద్వారంలో దాచేసింది. దాన్ని బయటికి తీయడానికి రకరకాల పద్ధతులను ప్రయోగించి చివరికి ఆసుపత్రి పాలైంది.

అమెరికాలోని టెన్సీకి చెందిన క్రిస్టీ బ్లాక్‌ అనే ఒక మహిళ తన స్నేహితుడికి చెందిన ఐదువేల డాలర్లను కాజేసింది. దాన్ని అలాగే తన మలద్వారంలో దాచేసింది. తర్వాత దాన్ని బయటికి తీయడానికి స్నానాల బాత్రూం బ్రష్‌, పట్టకారుతో బాగా ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో తీవ్ర రక్తస్రావమైంది. చివరికి ఆమెను హాకిన్స్‌ కౌంటీ మెమోరియల్‌ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చేర్చారు. వైద్యులు చివరికి ఆమె దాచిన డబ్బును బయటికి తీశారు. బ్లాక్‌పై అనుమానంతో ఆమె స్నేహితుడు బాబీ గుల్లే ఒక పథకం ప్రకారం నాలుగువేల డాలర్లు ఒక సంచిలోను, వెయ్యి డాలర్లను మరో సంచిలోను ఉంచి నిద్రపోయాడు. నిద్రలేచి చూసేసరికి డబ్బు సంచులు కనిపించలేదు. బ్లాక్‌ను నిలదీశాడు. చివరికి ఆమె మలద్వారంలో ఆ డబ్బును దాచినట్టు తెలుసుకున్నాడు. తన స్నేహితుడు తనను ఇంటినుండి బయటికి తరిమేస్తే బతకడానికి డబ్బు కావాలి కాబట్టి తాను ఈ దొంగతనానికి పాల్పడినట్టు బ్లాక్‌ ఒప్పుకుంది. మొత్తానికి ఈ అమ్మడికి అటు దొంగసొమ్ము దక్కకపోగా పోలీసు కేసుతోబాటు ఒళ్లు కూడా హూనమయ్యింది.

  • Loading...

More Telugu News