: సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీశైలం వరకు పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే
సమైక్యాంధ్రకు మద్దతుగా ఒక్కొక్కరు ఒక్కో రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. శ్రీకాకుళంలో రికార్డు స్థాయిలో 176 కిలో మీటర్ల మానవహారం ఏర్పడితే.. జిల్లాల్లో సమైక్యవాదులు లక్ష గళ గర్జనతో హోరెత్తిస్తున్నారు. తాజాగా ఓ ప్రజాప్రతినిధి సమైక్యానికి మద్దతుగా పాదయాత్ర చేశారు. రాష్ట్రం ఒక్కటిగా ఉండాలంటూ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేశారు. శ్రీశైలంలో భోళా శంకరుడిని దర్శించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా దీవించమని పూజలు చేసి వేడుకున్నారు.