: సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రైవేటు ఆసుపత్రుల మూసివేత
సమైక్య ఉద్యమంలో అన్ని వర్గాలు, విభాగాలు భాగస్వాములవుతున్నాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లా విజయవాడలో రేపు ప్రైవేటు ఆసుపత్రులు బంద్ పాటించనున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రైవేటు ఆసుపత్రుల మూసివేతకు ఐఎంఏ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అత్యవసర వైద్యసేవలు మాత్రమే కొనసాగిస్తూ ఆసుపత్రుల్లోని అన్ని విభాగాల ఉద్యోగులు నిరసనల్లో పాలుపంచుకోనున్నారు.