: నవంబర్ 1 డెడ్ లైన్: మంత్రి విశ్వరూప్


నవంబర్ 1 వరకు అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురు చూస్తానని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. హైదరాబాద్ లో ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని అధిష్ఠానం వెనక్కి తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. సమైక్యాంధ్ర అనుకూల నిర్ణయం కోసం నవంబర్ 1 వరకు వేచిచూస్తానని, అధిష్ఠానం నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే 2న రాజీనామా చేస్తానని ఆయన తెలిపారు. విభజన జరిగితే తీవ్రంగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయేనని విభజన ప్రకటనకు ముందు ఆయన హెచ్చరించారు. అలాగే ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.

  • Loading...

More Telugu News