: జగన్ కు మరో రెండు రోజులు చికిత్స
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ఆమరణ దీక్ష భగ్నమైన సంగతి తెలిసిందే. తొలుత ఆయన చంచల్ గూడ జైల్లో దీక్ష ఆరంభించగా, పోలీసులు ఉస్మానియాకు తరలించారు. అక్కడ సౌకర్యాలు సరిగ్గాలేవని తర్వాత నిమ్స్ కు మార్చారు. అక్కడ జగన్ ఆరోగ్యస్థితి విషమిస్తుండడంతో వైద్యులు బలవంతంగా ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. దీంతో, కడప ఎంపీ దీక్ష సంపూర్ణంగా భగ్నమైంది. ఈ నేపథ్యంలో జగన్ కు మరో రెండ్రోజుల పాటు చికిత్స అవసరమని నిమ్స్ వైద్యులు తెలిపారు. ఏడు రోజులపాటు ఆహారం తీసుకోకపోవడంతో బాగా నీరసించాడని చెప్పారు.