: రివెంజ్ తీర్చుకునేందుకు టీమిండియాకు చాన్స్
భారత క్రికెట్ జట్టు రెండేళ్ళ క్రితం ఇంగ్లండ్ లో పర్యటించినప్పుడు దారుణ పరాభవాలను చవిచూసింది. 2011లో ఇంగ్లిష్ గడ్డపై నాలుగు టెస్టులాడిన ధోనీ సేన టెస్టు సిరీస్ ను 0-4తో కోల్పోయింది. దాంతో, ధోనీ కెప్టెన్సీ సామర్థ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే, ఆనాటి పరాజయాలకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పడు భారత్ ముంగిట నిలిచింది. వచ్చే ఏడాది టీమిండియా ఓ సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లండ్ లో అడుగుపెట్టనుంది. ఈ సిరీస్ లో ఐదు టెస్టులు, ఐదు వన్డేలు, ఓ టి20 మ్యాచ్ ఆడనుంది. టూర్ 2014 జూన్ 23 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరుగుతుంది. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) టూర్ షెడ్యూల్ ను నేడు ఖరారు చేసింది.