: కాంగ్రెస్ లో టికెట్ ఆశావహులకు రాహుల్ గాంధీ పరీక్ష
కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశావహులకు ఆ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఒక పరీక్ష పెట్టబోతున్నారు. ఆయన రూపొందించిన 5 పేజీల ధరఖాస్తును అభ్యర్థి పూర్తి చేయాల్సి ఉంటుంది. తాను పోటీ చేయదలచుకున్న నియోజకవర్గం గురించి, అక్కడ కాంగ్రెస్ పార్టీ బలాబలాల గురించి అభ్యర్థికి ఏమాత్రం తెలుసన్న విషయం ఈ దరఖాస్తుతో తేలిపోతుందన్నది రాహుల్ ఆలోచన. టికెట్ల విషయంలో పైరవీలకు, మధ్యవర్తులకు తావీయకుండా అర్హులైన అభ్యర్థుల ఎంపికకు ఈ విధానం దోహదం చేస్తుందని ఆయన భావిస్తున్నారు. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈ కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారు.