: ఆశారాం బాపుకు జ్యుడీషియల్ కస్టడీ
ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు జోధ్ పూర్ న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. 16 సంవత్సరాల బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారాంను నిన్న పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఆయనను ఉంచిన బ్యారక్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.