: బలహీనులు, అవకాశవాదులే పార్టీని వీడుతారు: రఘువీరారెడ్డి
అవకాశవాదులే పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళతారని మంత్రి రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రజల మనోభావాలను అధిష్ఠానం గౌరవించాలని ఆకాంక్షించారు. సమస్యలను సరైన రీతిలో పరిష్కరిస్తే సమాధానాలు దొరుకుతాయని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనేదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. అధిష్ఠానాన్ని ఒప్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఢిల్లీ వెళ్లి తమ ప్రయత్నాలు మళ్లీ కొనసాగిస్తామని, ఉద్యోగులను సమ్మె విరమించాలని కోరుతున్నామని రఘువీరా తెలిపారు. అయితే ఇప్పటి వరకు జరిగింది పార్టీల నిర్ణయాలే తప్ప ప్రభుత్వ నిర్ణయం కాదన్నారు.