: రేపోమాపో కాంగ్రెస్ పతనం ఖాయం: కిషన్ రెడ్డి
అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఐసీయూలో ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. రేపో మాపో ఆ పార్టీ పతనం కూడా ఖాయమని హెచ్చరించారు. సీడబ్ల్యూసీలో తెలంగాణపై నిర్ణయం తీసుకుని నెల గడుస్తున్నా.. కేంద్రం ఏమాత్రం ముందడుగు వేయలేదన్నారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో ఏర్పాటు చేసిన పార్టీ భారీ బహిరంగ సభలో పాల్గొన్న కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ.. భారత భూభాగంలోకి చైనా, పాక్ సైన్యం చొచ్చుకొస్తున్నా ప్రధాని నిశ్చేష్టులుగా ఉన్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి ప్రాంతాన్ని కోల్ కారిడార్ గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.