: 'గే అండ్ గైస్' సంపన్నుల పార్టీ.. పబ్ లపై విరుచుకుపడ్డ పోలీసులు
హైదరాబాద్ లో పెరుగుతున్న పబ్ సంస్కృతిపై తీవ్ర నిరసనలు ఉన్నాయి. అయినప్పటికీ క్లబ్బులు, పబ్బులకు ఉన్నత శ్రేణి వర్గాల్లో ఉన్న ఆదరణతో పోలీసులు అంటీముట్టనట్టు వ్యవహరిస్తుంటారనే అపవాదు కూడా ఉంది. ప్రతి వీకెండూ ఉన్నత శ్రేణికి పండగే. శని, ఆది వారాలు రాత్రిళ్లు ఇళ్లలో ఉండే వారి కంటే పబ్బుల బాటపట్టేవారే ఎక్కువ. దీంతో నగరంలోని పబ్బులు వీరి సందడితో, కాసుల గలగలలతో, బాటిళ్లు, గ్లాసుల చప్పుళ్లతో కళకళలాడతాయి. ఇక్కడ వేలంవెర్రిగా విచిత్ర పోకడలు రాజ్యమేలుతాయని టెకీల గుసగుసలు.
అయితే, గతవారం పూటుగా తాగి అడ్డదిడ్డంగా కారు నడిపి పలువురు గాయపడటానికి కారణమైన యువత కారణంగా పబ్ లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు వెస్ట్ జోన్ ప్రత్యేక పోలీసులు. దీంతో బేగంపేటలోని పల్స్, తాజ్ బంజారాలోని అండర్ డెక్, జూబ్లీహిల్స్ లోని సియా పబ్ లపై దాడులు చేశారు. బేగంపేట పల్స్ పబ్ లో ఈవెంట్ మేనేజర్, నిర్వాహకుడు సహా మరో 60 మంది పై కేసులు నమోదు చేశారు. మరోచోట 'గే అండ్ గైస్' పేరుతో ప్రముఖుల పుత్రరత్నాలు పండగ చేసుకున్నాయి.