: ముషారఫ్ పై మర్డర్ కేసు


పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. తాజాగా, ముషారఫ్ పై లాల్ మసీదు ఆపరేషన్ వ్యవహారంలో హత్య కేసు నమోదు చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన బెనజీర్ భుట్టో హత్య కేసులో రిమాండులో ఉన్నారు. 2007లో ఓ మిలిటరీ ఆపరేషన్ సందర్భంగా, పాక్ దళాలు ఇస్లామాబాద్ లోని లాల్ మసీదులో మతగురువు అబ్దుల్ రషీద్ ఘాజీని కాల్చి చంపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News