: చంద్రబాబుకు చేదు అనుభవం
గుంటూరు జిల్లాలో తెలుగువారి ఆత్మగౌరవం పేరిట బస్సు యాత్ర నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనను విద్యార్థులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్ర ప్లకార్డులు చేతబట్టిన విద్యార్థులు బాబు సమైక్యాంధ్ర నినాదాలు చేయాలంటూ పట్టుబట్టారు. కాగా, బాబు తన బస్సుయాత్రను రెండోరోజు పిడుగురాళ్ళ నుంచి ప్రారంభించారు.