: 'రాత్రివేళ పెట్రోలు బంక్ లు బంద్' ప్రతిపాదనను తిరస్కరించిన ప్రధాని


'రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు దేశంలో పెట్రోలు బంకులు మూసి వేయాలి' అన్న పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రతిపాదనను ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్ధికమంత్రి పి.చిదంబరం తిరస్కరించారు. పెట్రోలు బంకులను రాత్రివేళల్లో మూసినట్టయితే, పెట్రోల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని, తద్వారా డిమాండ్ ను నియంత్రించవచ్చని పెట్రోలియం శాఖ భావించింది.

రెండు రోజుల కిందట లీటరు పెట్రోలు ధర రూ.2.35 పైసలు పెరిగి వ్యాట్ తో కలిపి ఉన్న ధరకు మూడు రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. దాంతో, పెట్రోలు వినియోగ భారం కొంత తగ్గించుకోవడంతోపాటు ఆర్థికంగానూ ఉపశమనం పొందాలని భావించి ఈ నిర్ణయం చేసినట్లు నిన్న మొయిలీ తెలిపారు. కానీ, ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలపకపోవడంతో పెట్రోలియం మంత్రి మాట మార్చారు. బంక్ లు మూసివేత ఆలోచన తనది కాదని, ప్రజల నుంచి వచ్చినదేనని అన్నారు. మరోవైపు ఈ నెల 16 నుంచి పెట్రోలు పొదుపుపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News