: లోక్ సభ వాయిదా.. సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్
సీమాంధ్ర ఎంపీలు లోక్ సభలో మరోసారి సమైక్యాంధ్ర కోసం పట్టువిడవకుండా పోరాటం జరిపారు. సమైక్య నినాదాలతో సభను హోరెత్తించారు. తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలంటూ ఎలుగెత్తారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన లగడపాటి రాజగోపాల్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, బాపిరాజు, సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి, టీడీపీ ఎంపీలు మోదుగుల వేణుగోపాల్, కొనకళ్ళ సత్యనారాయణ, శివప్రసాద్, నిమ్మల కిష్టప్పలపై సస్పెన్షన్ వేటు వేశారు. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మరోవైపు రాజ్యసభను 15 నిమిషాలు వాయిదావేశారు.