: స్టాక్ మార్కెట్లపై రైల్వే బడ్జెట్ ప్రభావం.. నష్టాల్లో మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. పార్లమెంటులో ఈ రోజు రైల్వేమంత్రి పవన్ కుమార్ బన్సల్ రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టనుండడంతో మార్కెట్లపై ఆ ప్రభావం
ముందుగానే పడింది. బీఎస్ఈ సెన్సెక్సు 100 పాయింట్లకు పైగా నష్టపోతే,
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం మార్కెట్లో లోహ, చమురు, వాహన రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.