: 60 దాటిన మహిళల్లో వారానికోసారి చాలు!


60 దాటిన మహిళలు పూర్ణారోగ్యంతో ఉండడానికి వారానికి ఒకసారి వ్యాయామాలు చేస్తుంటే చాలునని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్యం కోసం వ్యాయామం అనే విషయంలో వయస్సులో ఉన్నప్పుడు తీసుకున్నన్ని జాగ్రత్తలు వయస్సు మళ్లిన తర్వాత తీసుకోవాల్సిన అవసరం ఉండదని ఈ అధ్యయనం భరోసా ఇస్తోంది.

బర్మింగ్‌హాం లోని అలబామా యూనివర్సిటీ వారు ఈ విషయంపై అధ్యయనం నిర్వహించారు. 60 ఏళ్లు దాటిన మహిళల్ని మూడు గ్రూపులుగా విభజించి, వారి మీద 16 వారాల పాటూ పరిశోధన నిర్వహించారు. వారితో ఈ కాలంలో ఒక గ్రూపుతో వారినికి ఒకసారి, మరో గ్రూపుతో వారానికి రెండుసార్లు, మూడో గ్రూపుతో వారానికి మూడుసార్లు ఏరోబిక్‌ ఎక్సర్‌సైజ్‌ ట్రైనింగ్‌లు మరియు రెసిస్టెన్స్‌ ఎక్సర్‌సైజ్‌ ట్రైనింగ్‌లు చేయించారు. అయితే తేలిందేంటంటే.. అందరిలోనూ సమానమైన ఫలితాలు కనిపించాయి. దాంతో 60 దాటిన మహిళలు వారానికి ఒకసారి వ్యాయామం చేస్తే సరిపోతుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ గార్డాన్‌ ఫిషర్‌ తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News