: హైదరాబాద్ ను సింగపూర్ లా మార్చాము: చంద్రబాబు నాయుడు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను సింగపూర్ లా మార్చిన ఘనత టీడీపీదేనని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర దాచేపల్లికి చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ పాలనలో తెలుగు వారిలో ఐకమత్యం వర్ధిల్లిందని అన్నారు. అలాంటిది ఇప్పుడు ఎక్కడ చూసినా దోపిడీ తప్ప మరోటి లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు వైఎస్ కు సోనియా గాంధీ సహకరించారని బాబు ఆరోపించారు. రాహుల్ ను ప్రధానిని చేసేందుకు మా పిల్లల కడుపు కొడతారా? అని ప్రశ్నించారు. అలాగే నీ బిడ్డ బెయిల్ కోసం, కేసుల మాఫీ కోసం తెలుగు జాతిని తాకట్టు పెడతారా? అని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ప్రశ్నించారు. తెలుగువారితో, తెలుగు దేశం పార్టీతో పెట్టుకున్న వారెవరూ బాగుపడలేదని బాబు దుమ్మెత్తి పోశారు.