: కాంగ్రెస్ వైఫల్యం వల్లే ఉద్యమాలు: స్వామి చిన్మయానంద
పాలనలో కాంగ్రెస్ వైఫల్యం చెందడం వల్లే ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమాలు జరుగుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిన తరువాత సీమాంధ్రలో గొడవలు ఆరంభమయ్యాయన్నారు. బీజేపీ అధికారంలో ఉండగా ఏర్పడిన మూడు రాష్ట్రాల్లో సంబరాలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. అసంబద్దంగా విభజన చేస్తే రాష్ట్రం ఇలానే అల్లకల్లోలమవుతుందని ఆయన విమర్శించారు.