: డిగ్గీరాజాకు మోడీ, సుష్మాస్వరాజ్ గుర్తొచ్చారు


కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి, బీజేపీ పార్లమెంటరీ పార్టీనేత సుష్మాస్వరాజ్ లు గుర్తొచ్చినట్టున్నారు. మరోసారి డిగ్గీరాజా నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. గతంలో గుజరాత్ ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఇద్దరు యువకుల మృతిపై మోడీ పెదవి విప్పడం లేదెందుకని ప్రశ్నించారు. వారిద్దరూ అనుమానాస్పద రీతిలో మృతి చెందారని జ్యుడీషియల్ కమీషన్ ఇచ్చిన నివేదికపై చర్యలు తీసుకోకపోవడానికి కారణమేంటని, మోడీ తక్షణం సమాధానం చెప్పాలని డిగ్గీరాజా అల్టిమేటం జారీ చేశారు.

అంతటితో ఆగని డిగ్గీరాజా, బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత సుష్మాస్వరాజ్ పై కూడా ప్రశ్నాస్త్రాలు సంధించారు. చీటికీ మాటికీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించే సుష్మ.. ఆశారాం బాపుపై వచ్చిన అత్యాచార ఆరోపణలను ఎందుకు ఖండించడం లేదని అడిగారు. తమ వారిపై ఆరోపణలు వస్తే ఒకలా, ఇతరులపై ఆరోపణలు వస్తే ఇంకోలా స్పందించడం ద్వారా బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News