: 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు అనుమతి లభిస్తుంది: ఎపీఎన్జీవోలు


సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 7న జరుగనున్న 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు అనుమతి లభిస్తుందని ఎపీఎన్జీవోలు తెలిపారు. హైదరాబాద్ లో ఎపీఎన్జీవోల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ సభకు అనుమతిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక వేళ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తే కోర్టుకు వెళ్తామని హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ తెలిపారు. ఎపీఎన్జీవోలు తల పెట్టిన సమ్మె 90 శాతం సక్సెస్ అయిందని తెలిపారు. సమ్మె విరమించాలని ఎవరూ తమను సంప్రదించలేదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News