: ఇంటి తాళం పగులకొట్టి రూ.6లక్షల సొత్తు అపహరణ
మెదక్ జిల్లా జోగిపేట పట్టణంలో దొంగలు ఇంటి తాళం పగులగొట్టి సుమారు రూ.6లక్షల విలువైన బంగారం, వెండి, నగదును దోచుకెళ్ళారు. పట్టణానికి చెందిన డాక్టర్ టి.ఎల్ శ్రీనివాస్ తన కుటుంబసభ్యులతో కలిసి శనివారం హైదరాబాద్ వెళ్లారు. ఇది గమనించిన దుండగులు శనివారం అర్ధరాత్రి ఇంటి తాళం పగులగొట్టి ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఈ రోజు ఉదయం ఇంటికి చేరుకున్న శ్రీనివాస్ చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్.ఐ ఘటనా స్థలికి చేరుకొని బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.