: గృహ నిర్బంధంలో వైఎస్ కొండారెడ్డి


కడప జిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ కొండారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఈయన కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువు. కడప జిల్లా చక్రాయిపేట మండలంలో రెండు సహకార సంఘాల ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. ఈ ఎన్నికలకు కొండారెడ్డి అడ్డుపడే అవకాశం ఉందనే ఆయనను గృహ నిర్బంధంలో ఉంచినట్లు పోలీసులు చెబుతున్నారు.

గతంలో కొండారెడ్డి శాసన సభ ఎన్నికల సమయంలో విఘాతం కలిగించారని.. 
దీంతో సహకార సంఘాల ఎన్నికల సమయంలో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకూడదనే ఉద్దేశ్యంతో ఆయనను గృహ నిర్బంధంలో ఉంచామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News