: ఆర్ధిక వ్యవస్థను రక్షించాలంటూ ప్రదర్శన
కుదేలవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించాలంటూ 'సేవ్ ఇండియా' పేరిట పలు స్వచ్ఛంద సంస్థలు విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించాయి. రూపాయి పతనంతో దేశం అథోగతి పాలవుతోందంటూ బందరు రోడ్డులో ప్రదర్శన చేపట్టారు. విదేశీ వస్తు వాడకాన్ని నిషేధించి, దేశీయ వస్తువులనే కొనుగోలు చేయాలని నినాదాలు చేస్తూ ఆకట్టుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ప్రతి భారతీయుడి సహకారం అవసరం అంటూ కరపత్రాలు పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని నినదించారు.