: బాల్యవివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎన్ అధికారులు


ప్రపంచం అభివృద్ధి, నాగరికత, గ్లోబలైజేషన్ అంటూ పరుగులు పెడుతోంది. అయినా దురాచారాలు వీడడం లేదు. అవగాహనా రాహిత్యంతో తప్పులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇద్దరు మైనర్ల పెళ్లికి సిద్ధపడ్డ రెండు కుటుంబాలకు పోలీసులు తమదైన ట్రీట్ మెంటిచ్చారు. వివరాల్లోకెళితే, కృష్ణా జిల్లా విజయవాడ బాలాజీనగర్ లో జరుగుతున్న బాల్యవివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. బాల్యవివాహం చేసేందుకు ప్రయత్నించిన బాలిక తల్లిదండ్రులపై ఐసీడీఎస్ అధికారులు కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు వివాహాన్ని అడ్డుకుని కౌన్సి లింగ్ ఇచ్చి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News