: రహదారుల దిగ్బంధానికి విశాఖ జిల్లా తెదేపా నేతల పిలుపు
విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు సమైక్యాంధ్రకు మద్దతుగా నేటి నుంచి 48 గంటల పాటు రహదారుల దిగ్బంధానికి పిలుపు నిచ్చారు. దీంతో మాడుగులకు వెళ్ళే రహదారులన్నిటినీ తెదేపా శ్రేణులు దిగ్బంధించాయి. అరకు ఏజెన్సీ ముఖద్వారం కాశీపురంలో తెదేపా కార్యకర్తలు రాస్తారోకో నిర్వహిస్తుండడంతో వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోయాయి.