: చంద్రబాబు యాత్రను అడ్డుకోం :ఏపీఆర్ఎస్ అధ్యక్షుడు బొప్పరాజు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఆత్మ గౌరవ యాత్రను తాము అడ్డుకోబోమని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా చంద్రబాబు సమైక్యాంధ్రపై స్పష్టత ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. రాజీనామా చేయని సీమాంధ్ర ప్రజాప్రతినిధులను జిల్లాల్లో అడుగు పెట్టనివ్వబోమని అన్నారు. ఈ నెల 7 న ఎల్బీ స్టేడియం లో నిర్వహించ తలపెట్టిన 'సేవ్ ఆంధ్ర ప్రదేశ్' కార్యక్రమంలో ఉద్యోగులందరూ పాల్గొంటారని తెలిపారు.