: షుగరు మందులు ఇలా కూడా పనిచేస్తాయి


షుగరు వ్యాధి అన్ని రకాలుగా మనిషిని నీరసింపజేస్తుంది. ముఖ్యంగా టైప్‌-2 మధుమేహంతో అల్జీమర్స్‌ ముప్పు ఎక్కువగా ఉంటుంది. అయితే అల్జీమర్స్‌ ముప్పును తగ్గించడంలో షుగరు వ్యాధికి ముక్కు స్ప్రే ద్వారా అందించే ఔషధాలు చాలా చక్కగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఉత్తర ఐర్లాండ్‌, స్వీడన్‌, అమెరికాలకు చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల్లో ముక్కు స్ప్రే ద్వారా అందించే షుగరు వ్యాధికి సంబంధించిన ఔషధాలు అల్జీమర్స్‌ ముప్పును తగ్గించడంలో చక్కగా తోడ్పడినట్టు తేలింది. మధుమేహ రోగుల చికిత్సకు ఉపయోగించే ఔషధాలు నాడీ క్షీణతకు సంబంధించిన వ్యాధుల్లో కూడా మంచి ఫలితాలను కనబరుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహం కారణంగా ఇన్సులిన్‌ క్షీణతతో మెదడులో సంకేతాలు తగ్గి నాడీ కణాలు దెబ్బతిని, అల్జీమర్స్‌ వ్యాధికి దారితీస్తాయి. చికిత్సలో ముక్కు ద్వారా ఇన్సులిన్‌ను పంపించడం అనేది సరికొత్త వ్యూహమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News