: తెనాలిలో స్పీకర్ ఇంటికి సమైక్యసెగ


గుంటూరు జిల్లా తెనాలిలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. ఈ సందర్భంగా, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వల్లే రాష్ట్రానికి ఈ గతి పట్టిందని, విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ఒత్తిడి తేవాలంటే ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేయాలని సమైక్యవాదులు నినాదాలు చేస్తూ ఒత్తిడి చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి సమైక్యవాదులకు సర్దిచెప్పి పంపించి వేశారు.

  • Loading...

More Telugu News