: తీర్పును అంగీకరించబోం: 'నిర్భయ' సోదరుడు


ఢిల్లీ అత్యాచార ఘటనలో తొలి తీర్పుపై 'నిర్భయ' సోదరుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తీర్పు అనంతరం మాట్లాడుతూ, జువైనల్ జస్టిస్ బోర్డు ఇచ్చిన తీర్పును అంగీకరించబోమన్నారు. ఈ తీర్పును పైకోర్టులో అప్పీలు చేస్తామని చెప్పారు. ఇది తమకు అశనిపాతంలాంటిదన్నారు. తీర్పు వెలువడిన వెంటనే తన తల్లి పెద్దగా రోదించిందని తెలిపారు. అత్యంత క్రూరంగా ప్రవర్తించిన నేరస్తుడికి మూడేళ్ల శిక్ష సరిపోదని, అతన్ని సంస్కరించటం సాధ్యం కాదని అన్నారు. జువైనల్ హోమ్ లో కూడా నేరస్తుని ప్రవర్తన సరిగ్గా లేదని, ఇతర బాల నేరస్తులపై అతను దాడి చేశాడని తెలిపారు.

  • Loading...

More Telugu News