: భర్తను చంపి, శవాన్ని కుక్కర్ లో ఉడికించింది!


మనుషుల్లో ఆవేశం ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో తెలిపే సంఘటన చైనాలో జరిగింది. ఓ మహిళ తన భర్తను చంపి అతని శవాన్ని ఓ కుక్కర్ లో ఉడికించింది. చైనా తూర్పు ప్రాంతంలో ఓ వ్యక్తి తరచూ భార్యను, కుమార్తెను వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన ఆ ఇల్లాలు ఓ రోజు భర్తకు మత్తుమందిచ్చి, బంధించి, అతడిని వరుసగా మూడు రోజులపాటు తిండికి మాడ్చడమే కాకుండా దారుణంగా కొట్టింది. దీంతో, ఆ వ్యక్తి కాస్తా ప్రాణాలు విడిచాడు. దీంతో, ఆమె ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చింది. తాను చేసిన పని ఎంతటిదో క్రమంగా అర్థమయ్యేటప్పటికి అరచేతుల్లో చెమటలు పట్టాయి. మృతదేహాన్ని ఏం చేయాలన్న తలంపురాగానే, ఓ రంపం తీసుకుని భర్త శవాన్ని ఓపిగ్గా కోసి ముక్కలు చేసింది. అనంతరం వాటిని కుక్కర్ లో వేసి బాగా ఉడికించింది. అయితే, ఆమె అపరాధభావం భరించలేక నేరుగా పోలీసుల వద్దకు వెళ్ళి లొంగిపోయింది. అక్కడి పోలీసులు ఇప్పుడా కేసును దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News