: పరకాలకు వినోద్ సవాల్
విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్ కు టీఆర్ఎస్ నాయకుడు వినోద్ సవాల్ విసిరారు. రాష్ట్రం కలిసి ఉండాలని చెప్పడానికి వంద కారణాలున్నాయని పరకాల వ్యాఖ్యానించగా.. 'రేపటిలోగా ఒక్క కారణం చూపగలరా?' అని వినోద్ చాలెంజ్ చేశారు. హైదరాబాదులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వినోద్.. పరకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వెనకబాటుతనం పరకాలకు తెలియందికాదని అన్నారు. తెలంగాణలో పది జిల్లాలున్నాయని, వాటన్నంటికి కలిపి ఒకే నర్సింగ్ కళాశాల హైదరాబాదులో ఉందన్నారు. అదే సమయంలో సీమాంధ్రలో ఆరు నర్సింగ్ కాలేజీలు ఉన్నాయని వెల్లడించారు. ఇలాంటివి వేల కారణాలు తాము చూపుతామని వినోద్ చెప్పుకొచ్చారు. అంతేగాకుండా, రాష్ట్రం ముక్కలైనా ఏమీకాదని చెప్పాల్సిన బాధ్యత ఉన్నత విద్యావంతుడైన పరకాలకు ఉందని పేర్కొన్నారు.